Ekkado Putti Ekkado Perigi Lyrics In Telugu

 Ekkado Putti Ekkado Perigi Song Lyrics

Music    :  M M Keeravani

Singer   :  M M Keeravani

Lyrics    :  Chandrabose

Ekkado Putti Ekkado Perigi Lyrics In Telugu

ఓ మై డియర్ గాళ్స్ .. డియర్ బోయ్స్ .. 

డియర్ మేడమ్స్ .. గురుబ్రహ్మలారా ..

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము 

చదువులమ్మ చెట్టు నీడలో

వీడలేమంటు .. వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము 

చిలిపితనపు చివరి మలుపులో

వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు ..

వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు ..

నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలూ

సైన్సు లాబ్ లోనా షీలాపై చల్లిన ఇంకు చుక్కలూ

ఫస్ట్ బెంచ్ లోన మున్నీపై వేసిన పేపర్ ఫ్లైటులూ

రాధ జళ్ళోనుంచి రాబర్ట్ లాగిన రబ్బరు బాండులూ

రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు

ఖైలాష్ కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు

మరపురాని తిరిగిరాని గురుతులండి 

మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ

అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి 

ఆ అల్లరంటే మాక్కూడా సరదా లెండీ

వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు ..

వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు ..

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము 

చదువులమ్మ చెట్టు నీడలో

వీడలేమంటు .. వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము 

చిలిపితనపు చివరి మలుపులో

బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు జోకులూ

రాగిణి మేడం రూపురేఖ పైన గ్రూపు సాంగులూ

సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులూ

టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోక్ టిన్నులూ

బ్లాకుబోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్లుఫోనుల్లోన సిల్లీ న్యూసులు

బాత్ రూముల్లోన భావకవితలు 

క్లాస్ రూముల్లోన కుప్పిగంతులు

మరపురాని తిరిగిరాని గురుతులండి 

మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ

మనకు మనకు క్షమాపణలు ఎందుకండి 

మీ వయసులోన మేం కూడా ఇంతేనండి

వియ్ మిస్ ఆల్ ది ఫన్ వియ్ మిస్ ఆల్ ది జోయ్ వియ్ మిస్ యు ..

వియ్ మిస్ ఆల్ ది ఫన్ వియ్ మిస్ ఆల్ ది జోయ్ వియ్ మిస్ యు ..

Post a Comment

0 Comments